వికీవ్యాఖ్య tewikiquote https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.39.0-wmf.25 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీవ్యాఖ్య వికీవ్యాఖ్య చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk స్వామీ వివేకానంద 0 1896 17258 16739 2022-08-19T21:47:02Z Anssi Puro 2506 wikitext text/x-wiki [[File:Swami Vivekananda-1893-09-signed.jpg|right}200px|thumb|<center>స్వామీ వివేకానంద (1893)</center>]] '''[[w:స్వామీ వివేకానంద|స్వామీ వివేకానంద]]''' [[ఆంగ్లం]]; Swami vivekananda ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. ఇతను [[:వర్గం:1863|1863]] జనవరి 12న జన్మించాడు. ఇతని పూర్వనామం నరేంద్రుడు. [[:వర్గం:1902|1902]] జూలై 4న మరణించాడు. ==స్వామి వివేకానందుని ముఖ్యమైన ప్రవచనాలు== [[FIle:WikiProject_Swami_Vivekananda_header_image.jpg|300px|right|thumb|ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.]] *ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు. *ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. *కళింకిత హృదయులకు ఉధ్యాత్మిక వికాసం ఉండదు. *తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి. *దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు. [[File:Swami Vivekananda at Mead sisters house, South Pasadena.jpg|300px|right|thumb|జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది]] *దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు. *పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. *పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది. [[File:Swami Vivekananda California January 1900.jpg|300px|right|thumb|విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది]] *ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. *ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది. [[File:Swami Vivekananda South Pasadena California January 1900.jpg|400px|right|thumb|నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది]] *మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం. *మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం. *విశ్వాసమే [[బలము]], బలహీనతయే మరణము. *వేదకాలానికి తరలిపోండి. *సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది. *[[సముద్రం]] మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. *విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి. *తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. [[File:Swami Vivekananda (San Francisco), California 1900.jpg|300px|right|thumb|విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.]] *ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. *జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు. *జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది. *విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది. *టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది. *డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది. *చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు. *విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. *విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత. *అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం. *స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. *సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది. *నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది. *భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం. *మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య. *మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది. *సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక. *దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు. *ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవించ లేడు. *పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి. *నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది. *పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది. *ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం 2.అసూయ,అనుమానాల రాహిత్యం 3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం. *భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు,సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు. సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే. *మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం. *ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు. *అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి. *అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి. *బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి. *ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి. *మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు. *ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు. *సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి. *ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది. *స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు. *ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం. *అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు. *జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి. *ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి. *పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేడమే పూజలన్నింటి సారం. *దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది. *ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు. *నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది. *నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి. *అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే. *వ్యాకోచమే జీవనం,సంకోచమే మరణం. యావత్తు ప్రేమ వ్యాకోచం, యావత్తు స్వార్ధం సంకోచం.కనుక ప్రేమ మాత్రామే ఏకైక జీవన ధర్మం. *అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసమూ లోకంలోని అతి సాహసవంతులూ, సర్వోత్తములూ త్యాగం చేయాలి. అనంత ప్రేమ కరుణ గల వందల కొద్దీ బుద్దులు అవసరమై ఉన్నారు. *లోకానికి కావలసింది శీలం.ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో, నిస్వార్ధమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం. ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింప చేస్తుంది. *మతం సిద్ధంతాలలోనూ, రాద్ధాంతాలలోనూ, ప్రజ్ఞావాదాలలోనూ లేదు. మతం అంటే మన స్థితి, మన పరిణతే. మతమంటే సాక్షాత్కారానుభవమే. *మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కాని దానిని అనుసరించడానికి కాదు. *ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే. *సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు, కానీ దేనికొరకైనా సత్యాన్ని త్యజించకూడదు. *మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు. *మృగత్వం,మానవత్వం,దివ్యత్వం-ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు. *గులాబి పువ్వు తన పరిమళాన్ని గుబాళించేటట్లు,నువ్వు దానం చేయి. ఇస్తున్నాననే స్ప్రుహ లేకయే ఇవ్వటం దాని ధర్మం. *లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు. *ప్రకృతిని ప్రేమించు,అందాన్ని ఆస్వాదించు,మంచిని ప్రోత్సహించు,విజ్ఞానానికిచేయుతనివ్వు.. *పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతిగొప్ప పాఠం. *ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగి పోతాయి. *మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు. *ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు. *ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది. *అనుభవాల క్రమమే జీవితం. అనుభవమే గురువు.. *అవివేకం మనల్ని మందలిస్తుంది.జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది. *నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి, వ్యాప్తియే జీవనం, సంకుచితమే మరణం, ప్రేమ ద్వారా అందరిని నీలో ఇముడ్చుకో. *మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు. *జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికి అలానే వుంది. *కులం,సామాజిక ఆచారం.ఎందరో మేధావులు దానిని కూలద్రోయడానికి ప్రయత్నించారు. *ఆత్మను గురించి తెలియకుండా దేవుణ్ణి గురించీ తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం. *ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. *ఆలోచనలు జీవిస్తాయి,సుదూరం ప్రయాణం చేస్తాయి. *నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందినా ప్రయత్నం విరమించకు. *ప్రేమ,కోపం ఒకదాని కొకటి వ్యతిరేకం. *ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం. *చెడు తలచేవారు,కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు. వెలుగు చూడరు. *అదృష్టవంతునికి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు. *గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాలవల్లే సాధించబడతాయి. *ఈ లోకాన్ని ఏ ఇద్దరు ఒకే మాదిరిగా చూడరు. *దానం చేయడం మన భాగ్యం. అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ది చెందుతున్నాం. *దేవుడొక్కడే,మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు. *తమ మనుగడకై ఇతర దేశాలపై అధారపడే దేశాలు పతనం కాక తప్పదు. *మనిషైనా,జాతైనా ఇతరులను ద్వేషించి జీవించలేదు. *పొందాలనే కాంక్ష స్వార్ధం,స్వార్ధం దురవస్థకు దారి తీస్తుంది. *ధ్యానం మన ఊహను రూపొదించుకోవడం వల్ల సాధ్యమవుతుంది. *ఇంతకు ముందుకంటే ప్రపంచం నేడు జ్ఞానసముపార్జనలో మరింత ఐక్యమత్యంతో వుంది. *నాటకం అన్ని కళలలోకి కష్టతరమైంది. *గుడ్డిగా నమ్మడం పెద్ద తప్పిదం. *ఆధునిక ప్రపంచంలో పనిని గురించి మాట్లాడినంతగా ఆలోచనల్ని గురించి మాట్లాడటం లేదు. *బద్దకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం. *స్వర్గంలో జీవించడానికి, ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు. *మూర్ఖులకు సెలవు దినం సోమరితనం, మన పేదరికానికి అసలు మూలం సోమరితనం. *వైవిద్యమే జీవితపు ఆత్మ. *ధనం శక్తి కాదు.మంచితనమే శక్తి. *పరిస్థితులకు ఆత్మ, ప్రజలకు మత్తు మందు, భౌతికంగా అనారోగ్యవంతుడికి ఏ మతము అంగీకారం కాదు. *మనం జీవితంలోనూ,అదృష్టంలోనూ,మతంలో కూడా వ్యాపారస్తులమే. *మనల్ని కౄరులగా మార్చేది మతమే, అత్యంత సాత్వికులుగా మార్చేది మతమే. *ప్రపంచంలో కోర్కెలే లేని మూర్ఖులు ఉంటారు. దానికి కారణం వాళ్ల మెదడు లోభభూయిష్టం కావడమే. *నిరుపేదల కష్టాలను చూచీ ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు. *ప్రతి జాతి,ప్రతి స్త్రీ,ప్రతి పురుషుడు తమ మోక్షసిద్ధికి తామే ప్రయత్నించాలి. *చాలా మందికి మోక్షం కావాలా అంటే అవునంటారు. కాని కొందరే పొందగలరు. *మనం గ్రహించాల్సింది సమాజానికి మోక్షం లభించనిదే వ్యక్తిగా మోక్షం కలుగదు. *జీవితపు రహస్యం సంతోషం కాదు. అనుభవం ద్వారా విద్య. *చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. *ధనం,సంపాదన తప్పనిసరిగా సామాన్య ప్రజల పేదరికాన్ని తగ్గిస్తాయి. *మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది. *వికాసానికి కారణం? కోరిక. *విచక్షణ కంటే భావావేశం గొప్పది. అయితే భావావేశం విచక్షణకు విరుద్ధంగా ఉండకూడదు. *మన అదృష్టానికి మనమే కర్తలం. *మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు. *నాగరకుడి వివేచనతో పని చేయడానికి విశ్రాంతి అవసరం. *ఈ దేశానికి వీరుల అవసరం వుంది.అందుకే వీరులుకండి. *పరతత్వాన్ని దాన్ని గూర్చి చెప్పే తత్వశాస్త్రమే వేదాంతం. *ప్రతి విజ్ఞాన శాస్త్రానికి దాని విధానం దాని కుంది. *మనం సంతోషపడే విషయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. *ప్రతి మానవజీవికి అనంతమైన సంతోష భావన వుంటుంది. *మతానికి కులం లేదు,కులం ఒక సామాజిక వ్యవస్థ. *సత్యాన్ని,స్వచ్ఛతను, అదృష్టాన్ని నాశనం చేయలేము. *మానవుడు స్వార్ధపు మోపు. *సముద్రం లోతు, ఆకాశమంత వైశాల్యం.అలాంటి హృదయమే కావాలి. *మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు...నిశ్శబ్దంగా ధ్యానం చేయి. *నాయకుడు శీలవంతుడు కాకపొతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం కాదు.నాయకుని శీలం పవిత్రమైనకొద్దీ అనుచరులు విశ్వాసం,విధేయత పెంపొందుతాయి. *సర్వ దేవతలకన్నా మానవుడు అధికుడు, మానవునికన్నా అధికులెవ్వరు లేరు *పరిస్థితులు మనిషి అదుపులో వుండవు కాని అతని ప్రవర్తన అతని ఆధీనములోనే వుంటుంది. *ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. *గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి , ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అపుడే విజయం మనదవుతుంది. *మానవునిలోని పరిపూర్ణతను వ్యక్తపరచడమే విద్య, అతనిలో దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతము. *వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానములోనే జీవిస్తాడు. *జీవితము చిన్నది ధైర్యముగా పోరాడు, ఉదాత్తమైన లక్ష్యం కోసం దానిని త్యాగం చేయడానికి వెనుకాడకు. *ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా వుంది. అంతర్గతముగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. *ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికే వజ్రసంకల్పం సాధ్యపడుతుంది. *లేవండి, మేల్కొనండి గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి. *ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు. *మన దేహాన్ని కాని మన మనసును కాని బలహీన పరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందముగా త్యాగము చేయాలి. *ఎక్కడెక్కడ పోరాటం , తిరుగుబాటు ఉద్భావిస్తాయో అక్కడే జీవముంది, సత్యముంది, చైతన్యముంది. ప్రతీ గొప్పకార్యము అవహేళన, ప్రతిఘటన ఆ తరువాత అంగీకారము అనే మూడు మజిలీల గుండా సాగిపోతుంది. *ఈ ప్రపంచములో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే ... సంపదలు, కీర్తిప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలినవారంతా జీవన్మ్రుతులు. *ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము. ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంత వరకు ధ్యానం, ఏకాగ్రతలు సాధ్యం కావు. కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే. *శ్రీ రామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిననాడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు. *మానవ చరిత్రనంతటిని పరికిస్తే ఘనకార్యాలు చేసినవారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువ సామర్ధ్యమిచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడా ఆత్మవిశ్వాసమే, ఆత్మవిశ్వాసం అన్నింటిని సాధించగలదు. *అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి. ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి భోరున విలపించేదుకు మరో ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి . మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్తితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి. *పరాక్రమం, పోరాటతత్వం పురుషుల సొంతమనే భ్రమలనుంచి బయటపడాలి. ఆ కోణంలోను తమకు అడుగుజాడలను పరచిన ఝాన్సీరాణి, రుద్రమ దేవి వంటి నారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి. *ఏ పనినైనా సాదించాలంటే దీక్ష,పట్టుదలతో పాటు ధ్రుడసంకల్పం అత్యావశ్యకం . నేని సముద్రాన్ని ఔపాసన పట్టేస్తాను , నేని కొండలను పిండి పిండి చేస్తాను అంటాడు పట్టుదల గల వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతారు. *నీకు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో. *ఇతరుల కోసం మనం తీసుకునే అత్యల్పమైన శ్రమ మనలో ఉన్న శక్తిని తట్టి లేపుతుంది. ఇతరుల శ్రేయస్సును గురించి ఏ కొంచెం ఆలోచించినా కూడా అది సింహానికి సమమైన శక్తిని మన హృదయానికి క్రమక్రమముగా ఇస్తుంది. *మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు. *భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి. మత సిద్ధాంతాలతో వ్యక్తి మనసు పాడుచేసుకోకూడదు. *ఆత్మ విశ్వాసం,దేవుని యందు విశ్వాసం ఇవియే ఔన్నత్యానికి కీలకం. *ఏది తొందరపడి చేయకూడదు. పవిత్రత,ఓర్పు,ఎడతెగని ప్రయత్నం ఈ మూడు విజయానికి సోపానాలు. వీటన్నింటి కన్నా మఖ్యమైంది ప్రేమ. అనంతమైన కలం నీ ముందు వుంది,అనవసరమైన తొందరపాటు వద్దు. *పవిత్రత,సత్యసంధత నీలో నెలకొంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. నీలాంటి వందల మంది మనకు కావాలి. వారు సమాజం మీదకు దూకి దానిని అదరగొట్టాలి. *ఎక్కడకు వెళ్ళినా నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తినీ అందించాలి. *ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం. *ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు. *ఆత్మ సందర్శమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం. *చావు బతుకులు ఎక్కడో లేవు. బలంలో బతుకుంది, బలహీనతలో చావుంది. *మన గురించి మనం ఆలోచించుకోవడమే స్వార్ధం. అదే మహాపాపం. *నేను నరకానికి వెళ్ళడం వాళ్ళ నా సోదరులకు ఉపయోగం ఉంటుందంటే, నరకానికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నని అనగలిగిన వాడే నిస్వార్ధపరుడు. *పేదల కోసం, పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో వారే మహాత్ములు. *బీదలు,నిరక్షరాస్యులు,అమాయకులు,భాధ పీడితులు వీరిలో మనం భగవంతున్ని చూడగలగాలి. వీరి సేవయే భగవంతునికి ప్రియమైనది. *ఏ కార్యాన్ని సాధించాలన్న పవిత్రత, సహనం,పట్టుదల,ప్రేమ అవసరం. * ఒకటీ రెండు గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన పదీ ఇరవైమంది కార్యకర్తలు ఇవి చాలు. అవే అన్నటికీ నాశనం కానీ బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేలమంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. మనకిప్పుడు వందలకొద్దీ నక్కలతో పని లేదు. సింహాలవంటి వాళ్లు ఆరుగురు చాలు. వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు. *మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేడమే విజయ రహస్యము. *మనమందరమూ కష్టపడి శ్రమించాలి. మన కృషిపైన భావిభారత బాగ్యోదయం ఆధారపడి ఉంది. *బీదసాదల దుస్తితియే భారతదేశంలోని అన్ని అనర్ధాలకు మూలకారణం. వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం. *ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది. *ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికీ సేవకులలా మనం ప్రవర్తించాలి. స్వార్ధాన్ని విడనాడి కృషి చేయాలి. *నువ్వు స్వార్ధరహితుడవైతే ఒక్క పారమార్ధిక గ్రంధాన్నైనా చదవకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవుతావు. *ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి. పేదల సేవకన్నా మించిన భగవారాధన లేదు. *యువకులారా ! లెండి మేల్కొనండి! ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది. ఉత్సాహ భరితులై రండి. *ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చుడండి, అసాధారణమైన కార్యాలను కాదు. *ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆద్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం. *నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదలు,దుఃఖితులు, బలహీనులు అందరు దైవాలు కాదా ముందుగా వారినెందుకు పూజించకూడదు. గంగ తీరంలో బావి తవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు. *పిరికివాడు మాత్రమే 'ఇది నా తలరాత' అని అనుకుంటాడు. *సిద్ధాంతాలు మతం కాదు. మంచిగా ఉంటూ మంచిని పెంచడమే మత సారాంశం. *యువకులారా! నా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి.నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. *ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు. *సేవ చెయ్యి,ఏ స్వల్పమైనా ఇవ్వు, కాని బేరమాడ వద్దు. *ఎట్టి పరిస్థితులలోను నీవు శారీరకంగా కాని, మానసికంగా కాని, నైతికంగా కాని లేక ఆధ్యాత్మికంగా కాని బలహీనుడవు కాబోకు. *నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు. కానీ దేవుడు విగ్రహమనే భ్రాంతి విడవాలి. *మహిళల స్థితి గతులను మెరుగు పరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు. పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు. *ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు. *ప్రయత్నం చేయని వాడి కంటే పాటు పడేవాడు ఉత్తముడు. *తన సంతానంలో ఏ ఒకరినైనా సేవించు అధికారమును భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు ధన్యుడవే. ఇతరులకు లేని సేవాభాగ్యం నీకు కలుగుట చేత ధన్యుడవైతివి. ఈ సేవనే ఆరాధనముగా భావించు. *నీ పురోభివృద్ధి కోసం, ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతున్ని కొనియాడు. నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు. *స్వార్ధ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది. *పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు. జ్ఞానులు ఇతరుల కొరకు తమ జీవితాన్నే అంకితమిస్తారు. *త్యాగమూ, సేవ భారతదేశ ఆదర్శములు.వీటిని పటుతరం చేస్తే అంతా బాగుంటుంది. *మానవుణ్ణి అధ్యయనం చేయి, అతడే సజీవ కావ్యం. *మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం. *ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమేమి లేదు. *పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకంలో ధైర్య స్తైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి. ఎప్పటికి తరగని శాశ్వతమైన ప్రేమ,కరుణాకటాక్షాలు కలిగిన బుద్ధులు నేటికి అవసరం. *'విముక్తి' అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగ్ర్రుతమై ఉన్నదో, వాడే విముక్తిని పొందుతాడు. *ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. *జీవితం ఒక సంగ్రామం, కాని దానిని జయించుటకొక వ్యూహం కావలెను. దాని రూపకల్పన స్థాయిని అందవలెను. అదియు కౌమారమునందే. సందేహమెల? భావి జగజ్జేతావు నీవే. *చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది. వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది. *నిజాయితీ, ప్రేమ,ఓర్పు,మన అస్త్రశస్త్రాలైనపుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు. *ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే...ఏ ఆదర్శమూ లేని మనిషి యాభైవేల తప్పులు చేస్తాడు. *మనిషన్నవాడు ఏ మంచి పని చేయాలన్న కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా? అలజడి లేకుండా సముద్రం పలుకదు. కదలిక లేకుండా గుండె బతకదు. *మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి. మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నపుడు మీకు దాని స్పృహ ఉండదు. ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి. ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారుకండి. *ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనమందరం భావిస్తాం. ఐతే ముందుగా వాళ్లకో జీవితాన్ని అందివ్వాల్సిన భాధ్యత కూడా మనందరి పైనే ఉంటుంది. *విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు. అపజయం తుది మెట్టు కాదు. *స్వయంకృషి,పట్టుదల,ధృడ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. === ప్రేరణాత్మక వ్యాఖ్యలు === *బలంతో, ధైర్యంతో, భాద్యతతో పోరాడడం నేర్చుకో...నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. *సర్వ సన్నద్ధులైన యువకులు నేడు కావాలి. *వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనసును స్వాధీనంలో ఉంచుకుని బుద్దితో వివేచించి,ముందుకు నడిచేవాడు మహాత్ముడు. సమర్ధుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించ గలుగుతాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికీ పతనం తప్పదు. *రోజా పుష్పం కింద ముల్లున్నాయని దిగులు వద్దు. ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలుంటాయి. వాటిని అధిగామిస్తేనే మనం విజయం సాధించగలం. *గమ్యం పట్ల ఎంత శ్రద్ద వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ద వహించాలి. === భక్తి గురించి === *భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది. === దేశం గురించి === *దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు. తోటి మానవులకు సాయం అందించడం. === వ్యక్తుల గురించి === *కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు. కాని, ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. *విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది. Parula kosam jeevinche vari jeevithame dhanyam === విద్య గురించి వ్యాఖ్యలు === * విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. మనిషి వికాసానికి, నడవడికి తోడ్పడుతుంది.---[[స్వామి వివేకానంద]] {{wikipedia}} [[వర్గం:1863 జననాలు]] [[వర్గం:1902 మరణాలు]] [[వర్గం:భారతీయులు]] [[వర్గం:అధ్యాత్మిక నాయకులు]] [[వర్గం:హిందూమతము]] 66se6nelnia9ud40b39axyohs8fxmnr